కమ్యూనిటీ మార్గదర్శకాలు
Tinderకు స్వాగతం!
Tinder అంటే అర్థవంతమైన కనెక్షన్‌లు ఏర్పరుచుకోగల ప్రదేశం. ఇది స్వైప్ చేయడంతో ప్రారంభం అవుతుంది. కొన్నిసార్లు మీరు క్లిక్ చేస్తారు. కొన్నిసార్లు మీరు చేయరు. కొన్నిసార్లు మాట్లాడటం మరిన్నింటికి దారితీస్తుంది. అవకాశం పొంగిపొర్లుతోంది. అంతులేని అవకాశాలు. అన్వేషించడానికి వచ్చిన (యువత) అందరికి స్వాగతం.
ఎవరైనా వారిలాగే ఉంటూ ఇతరుల గురించి తెలుసుకునే ఒక ఆహ్లాదకరమైన, సురక్షితమైన మరియు సమ్మిళిత ప్రదేశంగా Tinder ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ కమ్యూనిటీ మార్గదర్శకాలు అందుకోసమే ఉన్నాయి–యాప్ లోపల మరియు బయట రెండుచోట్లా ప్రతి ఒక్కరి ప్రవర్తన కోసం అంచనాలను సెట్ చేయడానికి. కావున చదవగలరు; ఈ మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల చిన్నగా హెచ్చరించడం నుండి నిషేధించడం వరకు నిజమైన పర్యావసానాలకు దారితీయవచ్చు.
Tinder నిబంధనలు:
1. హద్దులను పరిగణించండి. కంఫర్ట్ స్థాయిలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. అందుచేత మీ పబ్లిక్ ప్రొఫైల్‌లో నగ్నత్వం, లైంగిక కంటెంట్, లైంగిక వాంఛలు, లేదా సెక్స్ కోసం వెతకడాన్ని మేము అనుమతించము. ఒకవేళ మీరు ప్రైవేట్ సంభాషణలో ఉన్నట్లయితే, ప్రతిఒక్కరూ దీనికి అంగీకరిస్తే, ఇవి ఫర్వాలేదు. సమ్మతి ముఖ్యం.
2. జాగ్రత్తగా మరియు ఆలోచించి షేర్ చేయండి. మీ వ్యక్తిగత సమాచారం లేదా వ్యక్తులు మీతో కనెక్ట్ అవ్వగల మార్గాలను పబ్లిక్‌గా షేర్ చేయవద్దు (ఫోన్ నెంబర్‌లు, ఇమెయిల్స్, లేదా సోషల్ హ్యాండిల్స్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్‌గా ప్రదర్శించవద్దు). మీ బ్యాంక్ ఖాతా నెంబర్‌లు లేదా ఇమెయిల్ పాస్‌వర్డ్ షేర్ చేయడం అనేది ఎప్పుడూ కూడా ఒక మంచి ఆలోచన కాదు. ఇతరుల వ్యక్తిగత వివరాలను కూడా మీకు పంపమని అడగవద్దు. జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా మిమ్మల్ని డబ్బు పంపమని అడిగితే లేదా పెట్టుబడి పెట్టమని మిమ్మల్ని బలవంతం చేస్తే, అది బహుశా స్కామ్ అయి ఉండవచ్చు.
3. హింసాత్మక కంటెంట్ పోస్ట్ చేయకుండా చూసుకోండి. మేము సానుకూలతను ప్రోత్సహిస్తాము, రక్తం చిందడం, మరణం, హింసాత్మక చర్యలను (మానవులు లేదా జంతువులకు విరుద్ధంగా) వివరించడం, ఆయుధాలను ఉపయోగించడం, మరియు స్వీయ హానిని సమర్ధించే లేదా గొప్పగా చూపించే ఏదైనా హింసాత్మక కంటెంట్‌ను మేము ఏమాత్రం సహించము.
తక్షణ హాని సంభవించే ప్రమాదం ఉందని మేము భావిస్తే, సాయం కొరకు సంక్షోభ వనరులను నేరుగా సంప్రదించి మేము తగిన చర్యలు తీసుకుంటాము.
4. బిజినెస్ కనెక్షన్‌లు కాకుండా, వ్యక్తిగత కనెక్షన్‌లను ఏర్పరుచుకోండి. ఫాలోవర్లను పొందడం, వస్తువులను విక్రయించడం, నిధుల సేకరణ లేదా ప్రచారం కోసం మీ సోషల్ హ్యాండిల్‌లను ప్రచారం చేయవద్దు, ప్రమోట్ చేయవద్దు. దీని అర్థం Tinder అనేది ఏదైనా సెక్స్ వర్క్, ఎస్కార్ట్ సర్వీస్‌లు, లేదా ప్రతిఫలం ఆశించే సంబంధాల స్థలం కాదు. అందుచేత, వద్దు–మీ షుగర్‌మమ్మీని కనుగొనడానికి Tinderను ఉపయోగించవద్దు.
5. మీరు మీలాగే ఉండండి చాలు. వ్యక్తులు మిమ్మల్ని, మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలుసుకొని మీతో మీట్ అవ్వాలనుకుంటారు. మీ నకిలీ వ్యక్తిత్వాన్ని కాదు. నకిలీ ఖాతాను క్రియేట్ చేయకండి లేదా కేవలం వినోదం కోసం అయినా సరే, మీరు వేరొకరిలాగా నటించకండి.
6. గౌరవప్రదంగా కమ్యూనికేట్ చేయండి. కొత్త వ్యక్తులతో మాట్లాడటం కాస్తంత గమ్మత్తుగానే ఉంటుంది. మరిముఖ్యంగా అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులతో సంభాషిస్తున్నప్పుడు. గౌరవం అనేది ఏదైనా సాధించడానికి సాయపడుతుంది.
ఒకవేళ సంభాషణ ఊహించని విధంగా గందరగోళంగా ఉండటం మరియు మీరు అప్‌సెట్ కావడం లేదా కోపంగా ఉన్నట్లుగా అనిపిస్తే–మీరు స్పందించడానికి ముందు కాసేపు ఆగి, ఆలోచించండి. వేధింపులు, బెదిరింపులు, ఆకతాయిలు సతాయించడం, జడిపించడం, ఇంటర్నెట్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచడం, లైంగిక సంబంధాల గురించి బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం లేదా హాని కలిగించడానికి ఉద్దేశ్యపూర్వకంగా చేసే ఏదైనా అనుమతించబడదు.
Tinderలో ద్వేషానికి స్థానం లేదు. మేము ఎన్నటికీ జాత్యాంహకారం, మతోన్మాదం, ద్వేషం లేదా వారు ఎవరు, వారిని ఎలా గుర్తిస్తారు లేదా వారు ఎలా కనిపిస్తారనే దాని ఆధారంగా హింసకు మద్దతు ఇవ్వము. ఇందులో ఒకరి జాతి, మానవ సమూహం, జాతీయత, ఇమిగ్రేషన్ స్టేటస్, కులం, మతం, జెండర్ గుర్తింపు, సెక్సువల్ ఒరియెంటేషన్, వైకల్యం, శరీర రకం లేదా ఆరోగ్య స్థితి ఉంటాయి (కానీ వీటికే పరిమితం కాదు). ఒకవేళ మీరు మీ వ్యక్తిగత ప్రమాణాలకు అనుగుణంగా లేని వ్యక్తిని చూసినట్లయితే, వారిని లైక్ చేయవద్దు లేదా అన్‌మ్యాచ్ చేసి, ముందుకు సాగండి. వారు మా పాలసీలను ఉల్లంఘించినట్లుగా మీరు భావిస్తే తప్ప, వారిని రిపోర్ట్ చేయవద్దు.
7. ప్రేమను పంచండి, ద్వేషాన్ని కాదు. మరొక యూజర్‌కు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో, శారీరకంగా లేదా డిజిటల్‌గా హాని కలిగించడాన్ని సూచించే, ఉద్దేశించే లేదా హాని కలిగించే ఏదైనా చర్య లేదా ప్రవర్తన - చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. హానిని కలిగించే లేదా ప్రేరేపించే ఏదైనా ఇందులో ఉంటుంది.
Tinderలో మిమ్మల్ని ఎవరైనా బాధిస్తే: మొదటగా, దయచేసి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు రెండవది, మీకు నయం కావడానికి ఏమి చేయాలనేది నిర్ణయించుకోవడానికి కొంత సమయం తీసుకోండి, అది జవాబుదారీ చర్యలు, వెల్లడి, మద్దతు లేదా పైన పేర్కొన్నవన్నీ కావచ్చు. ఇందులో హాని గురించి మాకు నివేదించడం ఉన్నట్లయితే, దయచేసి సంప్రదించండి. మీ కోసం మేము ఇక్కడ ఉన్నాము.
8. పెద్దలకు మాత్రమే. Tinder ఉపయోగించడానికి మీకు తప్పనిసరిగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. మీ చిన్నప్పటి ఫోటోలు– మీరు అప్పుడు చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నప్పటికీ వాటితో సహా ఒంటరిగా లేదా దుస్తులు లేకుండా ఉండే చిన్నారుల ఫోటోలను మేము అనుమతించమని కూడా తెలుసుకోండి.
9. చట్టానికి కట్టుబడి ఉండండి. ఎలాంటి చట్టవ్యతిరేక కంటెంట్ లేదా కార్యకలాపాలు, ఎన్నడూ అనుమతించబడవు. మీరు మాదకద్రవ్యాలు లేదా నకిలీ వస్తువులను కొనడానికి లేదా విక్రయించడానికి లేదా చట్టాన్ని ఉల్లంఘించడంలో మీకు సహాయాన్ని అభ్యర్ధించడానికి Tinderను ఉపయోగించలేరని దీని అర్థం. మైనర్‌లు లేదా మానవ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఏదైనా హానిని సమర్థించడానికి లేదా పాల్గొనడానికి ఎవరైనా Tinderను ఉపయోగించడాన్ని మేము ఏమాత్రం సహించము.
10. ఒక వ్యక్తికి ఒక ఖాతా. ప్రతి ఖాతాకు కేవలం ఒక్క యజమాని మాత్రమే ఉండాలి. లాజిస్టిక్ మరియు గోప్యతా కారణాల దృష్ట్యా, ఒకే ఖాతాను పలువురు వ్యక్తులు యాక్సెస్ చేయడానికి మేము సపోర్ట్ ఇవ్వలేము, ప్రతి వ్యక్తికి వారి స్వంత ఖాతా ఉండాలి. అలాగే, ఒక వ్యక్తి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉండకూడదు.
11. ఇది మీకు సంబంధించిన స్పేస్, ఇందులో మీ స్వంత కంటెంట్‌ను మాత్రమే పోస్ట్ చేయండి. ఇతర వ్యక్తులకు సంబంధించిన ఇమేజ్‌లను లేదా ప్రైవేట్ సందేశాలను పోస్ట్ చేయడానికి వారి నుండి సమ్మతిని పొందితే, వాటిని పోస్ట్ చేయవద్దు. ఇతరులచే కాపీరైట్ చేయబడిన లేదా ట్రేడ్‌మార్క్ చేయబడిన వర్క్‌ను పోస్ట్ చేయవద్దు.
12. మంచి Tinder యూజర్‌గా ఉండండి. Tinderను దుర్వినియోగం చేయవద్దు. తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి Tinderను ఉపయోగించవద్దు. హానికరమైన లింక్‌లు లేదా అవాంఛిత కంటెంట్‌ను స్పామ్ చేయవద్దు. సామూహిక ఖాతాలను సృష్టించవద్దు. మీకు డబ్బు లేదా మరేదైనా పంపడానికి లేదా పొందడానికి వ్యక్తులను తారుమారు చేయడానికి, అసత్యాలు చెప్పడానికి Tinderను ఉపయోగించవద్దు. మీరు కలిసే వ్యక్తుల గురించి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడటం మంచిదే, కానీ ఇతరుల సమాచారాన్ని బహిరంగంగా షేర్ చేయకండి. తప్పుడు, తప్పుదారి పట్టించే లేదా హానికరమైన రిపోర్ట్‌లను సబ్మిట్ చేయవద్దు. ఫీచర్‌లను అన్‌లాక్ చేయడానికి లేదా సిస్టమ్‌ను తారుమారు లేదా మోసం చేయడం కోసం థర్డ్ పార్టీ యాప్‌లు లేదా ఇతర టెక్నాలజీని ఉపయోగించవద్దు. Tinder, Match Group లేదా దాని అనుబంధ సంస్థలతో డైరెక్ట్‌గా మాట్లాడేటప్పుడు వేధించవద్దు, బెదిరించవద్దు లేదా ఈ నియమాలను ఉల్లంఘించవద్దు.
13. యాక్టివ్‌గా ఉండటానికి ఉపయోగించడం కొనసాగించండి. మీరు రెండు సంవత్సరాల్లో మీ Tinder ఖాతాకు లాగిన్ చేయనట్లయితే, మేము మీ ఖాతా ఉపయోగించబడట్లేదని భావిస్తాము మరియు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నందుకు దానిని తొలగించవచ్చు. అందువల్ల, మీరు యాప్‌లో కనిపించాలనుకుంటే, ఎప్పటికప్పుడు లాగిన్ అవ్వండి.
రిపోర్టింగ్
Tinder కమ్యూనిటీ మెంబర్‌గా, మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా మాట్లాడాలని మరియు అభిప్రాయాలను వ్యక్తం చేయాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఎవరైనా మీకు హాని కలిగిస్తుంటే లేదా మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తుంటే–దానిని రిపోర్ట్ చేయండి. మీ రిపోర్ట్ ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచబడుతుంది. రిపోర్ట్ చేయడం ద్వారా, హానికరమైన ప్రవర్తనను ఆపడానికి మరియు ఇతరులను సంరక్షించడంలో మీరు మాకు సాయపడవచ్చు.
ప్రభావం
మా సంఘం మార్గదర్శకాలను మరియు అవి మా సంఘంపై చూపే ప్రభావాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాము. ప్రజలు వాటిని అనుసరిస్తున్నారని ధృవీకరించుకోవడానికి మేము చేయగలిగినదంతా చేస్తాము. మా వద్ద హెచ్చరిక వ్యవస్థ ఉంది, కానీ ఉల్లంఘనలు కొనసాగితే లేదా ఉల్లంఘన తీవ్రంగా ఉంటే, మేము దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాము.
మీరు సేవలను దుర్వినియోగం చేసినట్లయితే లేదా సర్వీస్ ద్వారా మీరు కలుసుకునే ఇతరులతో సర్వీస్‌కు వెలుపల చోటు చేసుకునే ఏవైనా చర్యలు లేదా కమ్యూనికేషన్‌లతో సహా Tinder సముచితం కాదని, చట్టవ్యతిరేకమైనది లేదా వినియోగ నిబంధనలనుఉల్లంఘించే రీతిలో ప్రవర్తించినట్లుగా మేము కనుగొన్నట్లయితే, ఏవైనా కొనుగోళ్లును ఏమాత్రం రీఫండ్ చేయకుండానే ఖాతాలను దర్యాప్తు చేసే మరియు/లేదా తొలగించే హక్కు మాకు ఉంటుంది.